రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు.. 629 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-25 05:51:22  IST  )

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు.. 629 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసినట్లుగా ఇంధన వనరుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఈ మేరకు ట్రాన్స్‌కోలో 200 పోస్టులు, జెన్‌కోలో 100 పోస్టులు, ఈపీడీసీఎల్‌లో 135 పోస్టులు, ఎస్పీడీసీఎల్‌లో 134 పోస్టులు, సీపీడీసీఎల్‌లో 60 పోస్టులు భర్తి చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్, సివిల్, టెలికం, మెకానికల్ విభాగాల్లో బీటెక్ (B.Tech), బీఈ (B.E) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జులై 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు, సిలబస్, వయోపరిమితి వంటి నిబంధనలను మరో రెండు, మూడు రోజుల్లో అధికారికంగా వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.

Next Story