‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ ఐటమ్ సాంగ్.. ఎప్పుడు వస్తుందంటే?

by Pulgam srinivas |

నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఖయాదూ లోహర్‌పై ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ ఐటమ్ సాంగ్.. ఎప్పుడు వస్తుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, మమతా బైజు హీరోయిన్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం సెప్టెంబర్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ చిత్రంలో ఓ సూపర్ ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు, అందులో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఖయాదూ లోహర్ ఆడి పాడబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ పాటకు అనిరుద్ అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేసినట్లు, అది శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా నుంచి తదుపరి విడుదల చేయబోయే పాట కూడా ఇదేనని సమాచారం. ఈ సాంగ్‌ను ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో, ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్‌పై కూడా అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

Next Story