ఉట్నూర్ ఏజెన్సీలో జియో ‘సిగ్నల్’ తిప్పలు.. ప్రజలు ఏం చేశారంటే?

by Jakkula.Mamatha |

జియో సిమ్ వాడుతున్న సిగ్నల్ రాక ఇబ్బందులు పడుతున్నారని, ఏజెన్సీ ప్రాంత ప్రజలను జియో నెట్వర్క్ మోసం చేస్తుందని ప్రజా సంఘాల నాయకులు భరత్ చౌహన్ అన్నారు. గురువారం ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని చాందూరి గ్రామపంచాయతీలో భరత్ చౌహన్ పర్యటించారు.

ఉట్నూర్ ఏజెన్సీలో జియో ‘సిగ్నల్’ తిప్పలు.. ప్రజలు ఏం చేశారంటే?
X

దిశ, ఉట్నూర్: జియో సిమ్ వాడుతున్న సిగ్నల్ రాక ఇబ్బందులు పడుతున్నారని, ఏజెన్సీ ప్రాంత ప్రజలను జియో నెట్వర్క్ మోసం చేస్తుందని ప్రజా సంఘాల నాయకులు భరత్ చౌహన్ అన్నారు. గురువారం ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని చాందూరి గ్రామపంచాయతీలో భరత్ చౌహన్ పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై గ్రామంలోని వివిధ సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ప్రధానంగా జియో నెట్వర్క్ సేవలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి నెల రూ.350లతో రీఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ సరైన మొబైల్ సిగ్నల్, ఇంటర్నెట్ సేవలు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

నెట్వర్క్ సమస్యల కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్ విద్య, యువత ఉద్యోగ సమాచారం, రైతులు ప్రభుత్వ సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భరత్ చౌహన్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సరైన సేవలు అందించకపోవడం జియో సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెంటనే గ్రామంతోపాటు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి జియో సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు సిగ్నల్ రాని జియో సంస్థ ప్లకార్డులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story