- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AA23లో బన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం బన్నీ, అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో కనిపించే లుక్‌కు పూర్తిగా భిన్నంగా, లోకేష్ కనగరాజ్ చిత్రంలో కనిపించాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే లోకేష్ కూడా ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని విధంగా చూపించేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ‘రాకా’ చిత్రం పూర్తయ్యిన వెంటనే లోకేష్ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ మార్చుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చినప్పటి నుంచే అల్లు అర్జున్ - లోకేష్ కాంబో మూవీపై అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో కూడా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.






