‘రావు బహదూర్’ కోసం వెయిటింగ్ అంటూ మహేష్ బాబు పోస్ట్

by Chukka Sudharani |

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’.

‘రావు బహదూర్’ కోసం వెయిటింగ్ అంటూ మహేష్ బాబు పోస్ట్
X

దిశ, సినిమా: సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ 'GMB ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై, A+S మూవీస్ అండ్ శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్ల వంటి ఆకట్టుకునే ప్రచార చిత్రాల ద్వారా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు 'రావు బహదూర్' చిత్రంపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

‘రావు బహదూర్... ఇది కేవలం మిమ్మల్ని కట్టిపడేసే సినిమా మాత్రమే కాదు. మీ మనసులో లోతుగా ముద్ర వేసుకునే చిత్రం!!! విభిన్నంగా, అందంగా మరియు తీవ్రమైన డ్రామాతో కూడిన సినిమా ఇది. దర్శకుడు వెంకటేష్ మహా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.. ఆ ప్రపంచాన్ని సత్యదేవ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు! దీపా థామస్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.. గొప్ప నటీనటులు, అద్భుతమైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి గొప్ప మద్దతునిచ్చారు. మొత్తం బృందం పట్ల ఎంతో గర్వంగా ఉంది.. జులై 3 నుంచి థియేటర్స్‌లో 'రావు బహదూర్'ను, అతని 'మ్యాడ్‌నెస్'ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

Next Story