ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు : మాజీమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని.. అసహనంతో రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు : మాజీమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని.. అసహనంతో రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సెక్యూరిటీ తొలిగించడం సరైంది కాదన్నారు. ఆయన ఐపీఎస్ అధికారి అని.. అనేక అవార్డ్స్ వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ హయంలోనూ సమర్థవంతంగా పనిచేశారని.. సమర్థవంతంగా పనిచేసినందుకే ఆయనకు త్రెట్టు ఉన్నదని అన్నారు. ఆయనకు బతికినంత కాలం సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని.. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా సెక్యూరిటీ తీసేశారని పేర్కొన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు సైతం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో వందకు వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని.. కేసీఆర్ సీఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సెక్యూరిటీ తీసేస్తే భవిష్యత్‌లో ఊర్లో తిరగలేరని హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

Next Story