మత సామరస్యానికి ప్రతీక మొహరం పండగ

by Taduka Kalyani |

మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ నిలుస్తుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు అన్నారు.

మత సామరస్యానికి ప్రతీక మొహరం పండగ
X

దిశ, సంగారెడ్డి : మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగ నిలుస్తుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు అన్నారు. మొహర్రం సందర్భంగా ప్రజలకు షర్బత్ పంపిణీ చేశారు. మొహర్రం సందర్భంగా జగ్గారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో దర్గాను సందర్శంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్ల ఊరేగింపు చూసేందుకు వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు మొహర్రం వేడుకల్లో హాజరయ్యారన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కూన సంతోష్, షఫీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story