- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లబండ గూడెంలో విషాదం
by Ratna Kumari |
కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, కోదాడ : కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్కూరి ఉపేందర్ (12) అనే బాలుడు బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు బాలుడిని బయటకు తీసినా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.విషాదకర విషయం ఏమిటంటే, గతంలో ఇదే కుటుంబానికి చెందిన ఉపేందర్ అన్నయ్య కూడా ఇంకుడు గుంతలో పడి మృతి చెందాడు. ఇప్పుడు మరో కుమారుడిని కూడా కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించగా, గ్రామమంతా శోకసంద్రంగా మారింది.
Next Story






