- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గౌరారం వద్ద రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి
by Taduka Kalyani |
వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాయిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వర్గల్: వర్గల్ మండలం గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాయిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గౌరారం ఎస్ఐ ఆరోగ్యం తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల గ్రామానికి చెందిన షేక్ మీర్ మహమ్మద్ (55) సూరారం నుంచి ఆరోగ్య మిల్క్‌ను సిరిసిల్లకు తరలించి తిరుగు ప్రయాణంలో ఉండగా, గురువారం అర్ధరాత్రి గౌరారం గ్రామ శివారులోని సింగాయిపల్లి చౌరస్తా వద్ద ముందువెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించగా, శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి మొహమ్మద్ యాకూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆరోగ్యం తెలిపారు.
Next Story






