నీటిలో మునిగి మహిళ మృతి

by Ratna Kumari |

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన నిడమనూరు మండల పరిధిలో చోటుచేసుకుంది.

నీటిలో మునిగి మహిళ మృతి
X

దిశ, నిడమనూరు : నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన నిడమనూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొక్కముంతలపాడు గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మి (70) శుక్రవారం సాయంత్రం ప్రతిరోజులాగే బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, పోలీసులు కలిసి కాలువ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా కాలువ వద్ద మృతురాలి చేతికర్ర, చెప్పులు కనిపించాయి. దీంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి ఉంటారని భావించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కంపసాగర్ వద్ద లక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతురాలి కుమారుడు రమావత్ శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు.

Next Story