రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా 'తత్వం'

by Chukka Sudharani |

మిస్టరీ, ఇన్వస్టిగేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ చేసేందుకు రాబోతున్న చిత్రం 'తత్వం'.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తత్వం
X

దిశ, సినిమా: మిస్టరీ, ఇన్వస్టిగేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ చేసేందుకు రాబోతున్న చిత్రం 'తత్వం'. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. అర్జున్‌ కోల దర్శకత్వం వహిస్తున్నాడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ.. ‘ఈ మూవీ టైటిల్‌, కాన్సెప్ట్‌ను మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారుచేసుకున్నాను. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఇది. దినేష్‌ తేజ్‌ వినగానే వెంటనే ఓకే చేశాడు. ఈ సినిమా కోసం అందరూ దిబెస్ట్‌ ఇచ్చారు. కథ తప్పకుండా అందర్ని ఎంగేజింగ్‌గా ఉంటుంది. వంశీ గారి అన్వేషణ తరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది. ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటుంది’ అన్నారు.

Next Story