హెల్మెట్ లేకపోతే ప్రమాదం పై నుండి కూడా రావొచ్చు.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-26 16:47:53  IST  )

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రోడ్లపై వెళ్లేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు.

హెల్మెట్ లేకపోతే ప్రమాదం పై నుండి కూడా రావొచ్చు.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రోడ్లపై వెళ్లేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ రోడ్డు ప్రమాదం వీడియో చూస్తే ప్రమాదం ఇలా కూడా వస్తుందా అని ఆశ్చర్యపోక తప్పదు. బెంగుళూరులో ఓ వ్యక్తి రోడ్డుపై తన దారిలో తాను జాగ్రత్తగా వెళుతున్న సమయంలో అనుకోకుండా చెట్టుకొమ్మ విరిగి అతడి తలపై పడిపోయింది. దీంతో వెంటనే అతడు కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పక్కన వెళుతున్న వాహనదారులు, స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వీడియోలో చెట్టు కొమ్మ తలపై పడటం వల్లనే అతడు గాయపడినట్టు క్లారిటీగా కనిపిస్తుంది. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో హెల్మెట్ పెట్టుకుని ఉంటే అత‌డు ప్ర‌మాదం నుండి త‌ప్పించుకుని ఉండేవాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు ప‌దే ప‌దే చెబుతున్నా కొంత‌మంది హెల్మెట్ పెట్టుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారని అలాంటి వాళ్లు త‌ప్పుకుండా ఈ వీడియో చూడాల‌ని అంటున్నారు.

Next Story