- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకుకు వచ్చిన మహిళ వద్ద నగదు కొట్టేసిన దుండగులు అరెస్ట్..
by Kodari Anjali |
బ్యాంక్ వద్ద మహిళ దగ్గర 8 వేల రూపాయల నగదును అపహరించిన దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, గూడూరు: గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన అంగోతు లక్ష్మి తన భర్తతో కలిసి బుధవారం గూడూరు యూనియన్ బ్యాంకులో పంట రుణం వడ్డీ చెల్లించేందుకు బ్యాంకుకు రాగా బ్యాంకులో రద్దీ ఎక్కువగా ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్‌తో ఆమె వద్ద ఉన్న కవరును కట్ చేసి అందులో ఉన్న 8 వేల రూపాయల నగదును అపహరించారు. బాధితులు గూడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ డిటెక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసి 2 రోజులలో నిందితులను పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కుత్తాడి దుర్గ, యరచాని మహాలక్ష్మి, ఉయ్యాల గోపయ్య, కసాని అనంత సతీష్ కుమార్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.
Next Story






