- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1+1 టికెట్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు.. ఆ కాన్ఫిడెన్స్‌తోనే అంటూ కామెంట్స్
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా ‘దీవాన’. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు.

దిశ, సినిమా: యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా ‘దీవాన’. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చెయ్యగా.. ముఖ్య అతిథిగా వచ్చిన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘దీవాన సినిమా చూశాను. చాలా బాగుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని డైరెక్టర్ మీద కోపం వచ్చింది. క్యారెక్టర్స్ మీద లవ్ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంటుంది. హర్షిత్ నటన, వాయిస్ అంటే నాకు ఇష్టం. సహజంగా నటిస్తాడు. ఇతనికి మంచి ప్రాజెక్ట్ పడితే పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. ఇది లవ్ స్టోరీనే కాదు లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఎంతో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ ఇలాంటి డెప్త్ ఉన్న రైటింగ్ రాదు. సెకండాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ మూవీ చూశా. పర్ ఫార్మెన్స్‌లు అన్నీ బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫిల్ నెస్ వస్తుంది. నావంతుగా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా.
రేపు శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్‌కు తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. అది దీవాన సినిమాకు బూస్ట్ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నా. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే చెప్పండి, నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా. ఇది యూత్ ఫుల్ మూవీ అనుకుంటాం కానీ హ్యాప్పీగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. మీ ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాను మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.






