- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ కబ్జాలను సహించను: ఎమ్మెల్యే జూలకంటి
ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ఆయన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు...

దిశ, వెల్దుర్తి: ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ఆయన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని పరిష్కారించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
భూ కబ్జాలను సహించను..!
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల భూములను అన్యాయంగా లాక్కొని కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ ఎట్టి పరిస్ధితుల్లో క్షమించనని ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరించారు. మాచర్ల పట్టణం 7వ వార్డుకు చెందిన మేకపోతుల నాగలక్ష్మి అనే బాధితులు తన ఇంటిని వైసీపీ నాయకుడు కోనంగి రవికుమార్ అనే వ్యక్తి చంపుతానని బెదిరించి 2023లో కబ్జా చేశాడని, ఆనాడు అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని తనపై దాడికి యత్నించాడని ఎమ్మెల్యేకు ప్రజాదర్భార్‌లో ఆర్జీ ద్వారా జరిగిన అన్యాయాన్ని విన్నవించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి భూకభాలను తాను సహించే ప్రశ్నే లేదని హెచ్చరించారు.సమస్యను విచారించి, తక్షణమే పరిష్కరించాలని అర్బన్ సీఐ నజీర్ బేగ్, తహశీల్దార్ కిరణ్ కుమార్ లను ఆదేశించారు.






