- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవో 9 వెంటనే రద్దు చేయాలి.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి
జీవో 9 వెంటనే రద్దు చేయాలని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే ఈ జీవో 9 తెచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 9 వెంటనే రద్దు చేయాలని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే ఈ జీవో 9 తెచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కాలపరిమితి సగం ముగిసిపోయిందని.. రేవంత్‌రెడ్డి అర్ధ ఆయుషు మాత్రమే మిగిలి ఉన్నదని.. అయినా, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కేసీఆర్ కొనసాగించారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో విఫలమైందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిట రూ.10 వేల కోట్ల బకాయిలు పడ్డారని.. రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకుండా జీవో 9 తెచ్చారని అన్నారు.
విద్యను మెరుగు పరుస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్.. విద్యా వ్యవస్థను పూర్తిగా చెడగొడుతున్నారని ఆరోపించారు. మూడో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంటే రాష్ట్రంలో ఒక్క గురుకుల పాఠశాల నిర్మించలేదని.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటినే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అంటున్నారని పేర్కొన్నారు. ఆరుట్ల ప్రభుత్వ స్కూల్‌కు రంగులు పూసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం 30 నెలల పాలనలో 30 వేల ఉద్యోగాలు సైతం కల్పించలేదన్నారు. అలాగే.. ఆంగ్ల బోధనను మెరుగుపర్చడంలోనూ ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు.






