- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లైన 40 రోజులకే నవవధువు అనుమానాస్పద మృతి
పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌హెచ్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 40 రోజులకే నవవధువు యాండ్రాపు కృష్ణవేణి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది...

దిశ, విశాఖపట్నం: పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌హెచ్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 40 రోజులకే నవవధువు యాండ్రాపు కృష్ణవేణి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణికి ఈ ఏడాది మే 13న తన దగ్గరి బంధువైన యాండ్రాపు మురళీతో వివాహం జరిగింది. మురళీ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఓ దుకాణంలో పని చేస్తున్నారు.
వివాహం అనంతరం ఈ దంపతులు గత 20 రోజులుగా పీఎంపాలెంలోని ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం విధులకు వెళ్లిన మురళీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించినట్లు సమాచారం. దీంతో మురళీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.






