- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణను హైకోర్టు (Telangana High Court) ధర్మానం వచ్చేనెలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. పలువురు ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోలేదని, తాము సరైన ఆధారాలను సమర్పించినా వారిపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమయ్యారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయగా.. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని గతంలోనే ఆదేశించింది. నేడు దీనిపై విచారణ చేసిన సీజే ధర్మాసనం ప్రతివాదులైన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 22కు వాయిదా వేసింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) భారత్ రాష్ట్ర సమితి (BRS) గుర్తుపై పోటీ చేసి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు తదనంతరం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినట్లు BRS ఆరోపించింది. ఈ వివాదంలో గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ప్రధాన న్యాయపోరాటానికి దారితీసింది. స్పీకర్ ట్రైబ్యునల్ పరిధిలో జరిగిన విచారణలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సాంకేతికంగా పార్టీ మారలేదని, అందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ స్పీకర్ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ ఇచ్చిన ఈ "క్లీన్ చిట్" లేదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూనే BRS మరియు ఇతర నేతలు మళ్లీ హైకోర్టు మెట్లెక్కారు. తాము సమర్పించిన ఆధారాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదిస్తున్నారు.






