- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 14 బ్యాంకులతో సీఎం రేవంత్ ఒప్పందం
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులు సహా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత బీమా కల్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులు సహా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత బీమా కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి 14 బ్యాంకులతో MoU కుదుర్చుకుని, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. రవీంద్రభారతిలో ఆయా MoUలపై సీఎం సంతకాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థ లేదా ప్రభుత్వం కోసం కష్టపడేవారికి అండగా ఉండాల్సిన బాధ్యత యజమానిదేనన్నారు. దీనిని ఉద్యోగులు అడగకపోయినా ప్రభుత్వమే ఒకడుగు ముందుకు వేసిందన్నారు. ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రమాద బీమా ద్వారా ఉద్యోగులకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకూ కవరేజి ఉంటుందని, విమాన ప్రమాదబీమాకు బ్యాంకులు రూ.2కోట్లు -రూ.3 కోట్లు బీమాను అందిస్తున్నాయని వివరించారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు.
నేను గుంపు మేస్తీనే..
తాను గుంపు మేస్త్రీనే అని, మా మంత్రుల గుంపుకంతా మేస్త్రీనే అని.. ఎవరు అవహేళన చేసినా పట్టించుకోనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తన గుంపులో ఉన్నవారంతా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినేనని, ఆయ కుటుంబాల్లో కష్టాలెలా ఉంటాయో తెలుసన్నారు. హోదా, పదవులు మారినా, ప్రజలతో తనకున్న అనుబంధం మాత్రం మారదన్నారు. ఆనాడైనా, ఈనాడైనా తనను రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టమని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేద్దామని ఉద్యోగులను సీఎం కోరారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా పనిచేస్తే.. ఆ ఆదాయాన్ని ఉద్యోగుల కోసమే ఉపయోగిస్తామన్నారు. గత ప్రభుత్వం ఒకటోతారీఖు కాదుకదా.. పదోతేదీ వచ్చినా జీతాలివ్వలేని పరిస్థితి కల్పించిందని, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఉద్యోగులకు ఫస్ట్ తేదీనే జీతాలిస్తున్నామని తెలిపారు.
చింతబరిగె ఇరుగుద్ది..
ఇక ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగుల నమ్మకమే ప్రభుత్వానికి కొండంతబలమన్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినా.. ఉద్యోగులు మాత్రం శాశ్వతంగా ఉంటారన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులే వారదులు, సారథులుగా ఉంటారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక 70 వేల ఉద్యోగులు ఇచ్చామని గుర్తుచేశారు. గంగా, కావేరి, కృష్ణ వంటి నదుల పేర్లను ఆడబిడ్డలకు పెడుతున్నారని, మూసీనది పేరు ఎందుకు పెట్టడంలేదో ఎప్పుడైనా ఆలోచించారా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ అంటేనే కాలుష్యానికి మారు పేరుగా మారిందని, దానిని ప్రక్షాళన చేసేందుకు కాలికి కట్టె కట్టుకుని తిరుగుతుంటే.. ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని వాపోయారు. ఇక నగరం విస్తరించినపుడు మెట్రోకూడా విస్తరించాలని ప్రయత్నిస్తోంటే.. ఇప్పుడు వద్దని అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా ప్రతిదానికి అడ్డుపడితే చింతబరిగె ఇరుగుతుందని సీఎం హెచ్చరించారు.






