- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. యువకుడు స్పాట్ డెడ్
by Taduka Kalyani |
ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో ప్రధాన జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, చేర్యాల: ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో ప్రధాన జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముస్త్యాల గ్రామానికి చెందిన చిగుళ్ల వంశీ (25) వ్యక్తిగత పనుల నిమిత్తం చేర్యాల మండల కేంద్రానికి వచ్చి వెళ్తున్న క్రమంలో కోర్టు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొని సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతికి భార్య, తల్లి ఉన్నారు.
Next Story






