డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

by Batti.Sumithra |

జాతీయ రహదారి-44 పై గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
X

దిశ, ఎర్రవల్లి : జాతీయ రహదారి-44 పై గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటిక్యాల ఏఎస్ఐ సుధాకర్ వివరాల మేరకు ఎర్రవల్లి మండల పరిధిలోని బీచ్‌పల్లి బ్రిడ్జి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న డీసీఎం (DCM) వాహనాన్ని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం బాధితులు కారులో జాతీయ రహదారి పై వెళ్తుండగా బీచ్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు రాగానే అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక భాగంలో బలంగా ఢీ కొట్టారు. ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వెంకటేష్ కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని మరో ముగ్గురు రహీమ్, ఆఫీక్, మనిష్ కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి కొడుకు శివకుమార్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం మృతుడి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ లో భద్రపరిచినట్టు ఇటిక్యాల ఎస్సై సుధాకర్ తెలిపారు.

Next Story