పురుగుల మందు సేవించి విద్యార్థి బలవన్మరణం

by Taduka Kalyani |

లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన విద్యార్థి పురిమిట్ల ఆకాష్ (21) పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పురుగుల మందు సేవించి విద్యార్థి బలవన్మరణం
X

దిశ, మొయినాబాద్: లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన విద్యార్థి పురిమిట్ల ఆకాష్ (21) పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం తన స్కూటీపై బయటకు వెళ్లిన ఆకాష్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు పురిమిట్ల అవినాష్ చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అనంతరం మొయినాబాద్ మండలంలోని కనకమామిడి చౌరస్తా సమీపంలో ఆకాష్ పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు గుర్తించారు. అవినాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story