- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
రెబ్బెన మండలంలోని నవేగాం గ్రామంలో గురువారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేను రెవెన్యూ డివిజనల్ అధికారి లోకేశ్వరరావు ప్రారంభించారు.

దిశ, రెబ్బెన: రెబ్బెన మండలంలోని నవేగాం గ్రామంలో గురువారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేను రెవెన్యూ డివిజనల్ అధికారి లోకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ సర్వేను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తారని, ఓటర్లు వాటిని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో బీఎల్‌వోలు, అంగన్‌వాడీ సిబ్బంది, వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి సర్వేను విజయవంతం చేయాలని కోరారు. తహసీల్దార్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని, ఇంటికి తాళం వేసి ఉంటే పొరుగువారి ద్వారా వివరాలు తెలుసుకోవాలని తెలిపారు. అర్హులైన ఓటర్లు ఎవరూ మిగిలిపోకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న ఎస్‌ఐఆర్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు, గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.






