- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట.. ఆంక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభం శాంతి ఒప్పందంతో సద్దుమణగడంతో.. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఉన్న ఆంక్షలన్నింటినీ కేంద్రప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటా ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాసిన లేఖను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేంద్ర చమురు, సహజ వాయువు మంత్రిత్వశాఖ ప్రస్తుత పరిస్థితుల్ని సమీక్షించిన అనంతరం.. కమర్షియల్ సిలిండర్ల అమ్మకాలపై ఉన్న ఆంక్షల్ని సడలిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా గతంలో తాత్కాలికంగా విధించిన ఆంక్షల్ని తొలగించి, కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను సంక్షోభానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. బల్క్ ఎల్పీజీ సరఫరాను 50 శాతం వరకూ పునరుద్ధరించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కాగా.. ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ సదుపాయం ఉన్న వినియోగదారులు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దానినే కొనసాగించాలని సూచించింది. గ్యాస్ గ్రిడ్ అందుబాటులో ఉండి, పీఎన్‌జీకి మారే ప్రక్రియలో ఉన్న ఇతర వినియోగదారులను కూడా శాశ్వతంగా పీఎన్‌జీ పరిధిలోకి తీసుకురావాలని చమురు మార్కెటింగ్ సంస్థలకు (OMCs) ఆదేశాలు జారీ అయ్యాయి.






