- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారుల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి : శృతి ఓజా
బాలసదనంలోని చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు వారి సంరక్షణకు ప్రాధాన్యత నివ్వాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : బాలసదనంలోని చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు వారి సంరక్షణకు ప్రాధాన్యత నివ్వాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు. గురువారం గద్వాలలో పర్యటించిన డైరెక్టర్ స్థానిక బాలసదనంను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, సమీపంలోని పాఠశాలల్లో విద్యాబోధనకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా బాల సదనంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. వివిధ రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పలువురు చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు బాగా చదువుకోవాలని సూచించారు.
బాల సదనాన్ని వారంలో ఒకసారి పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు గద్వాలలోని సఖి కేంద్రమును సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శృతి ఓజా మాట్లాడుతూ సఖి కేంద్రం సేవలను గురించి ప్రజలకు అవగాహన కలిగేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. బాధిత మహిళలు, చిన్నారులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగు సూచనలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఐటీ, స్టోర్, సర్వైవర్, తదితర విభాగాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగారు. సమీపంలో నూతనంగా నిర్మించిన బాలసదనం భవనాన్ని పరిశీలించి మిగిలి ఉన్న పనులను పూర్తిచేసి ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ పర్యటనలో డిడబ్ల్యుఓ సునంద, డీసీపీఓ నరసింహ, సీడీపీఓలు రాజేశ్వరి, హేమలత, ఆకాశ దీప్తి, బాలసదనం పర్యవేక్షకులు వెంకటేశ్వరి, సఖి కేంద్రం సీఏ అరుణ, తదితరులున్నారు.






