- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు.

దిశ, భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి అదిలాబాద్ వైపు పల్సర్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులకు రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలోని వంతెన వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఏదైనా వాహనం ఢీకొని వెళ్లిందా..? లేక బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన అఖిల్ (20) తీవ్రంగా గాయపడగా, అదిలాబాద్‌కు చెందిన మరో యువకుడు కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జీఎంఆర్ సిబ్బంది వెంటనే స్పందించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అఖిల్‌ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.






