మహిళా కానిస్టేబుల్ పై దాడి కేసులో నిందితుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష

by Taduka Kalyani |

మహిళ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్ పదవ అడిషనల్ డిస్టిక్ట్ సెషన్ జడ్జ్ అన్నపూర్ణాదేవి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 500 రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.

మహిళా కానిస్టేబుల్ పై దాడి కేసులో నిందితుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష
X

దిశ, రాజేంద్రనగర్ : మహిళ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ నిందితుడికి రాజేంద్రనగర్ పదవ అడిషనల్ డిస్టిక్ట్ సెషన్ జడ్జ్ అన్నపూర్ణాదేవి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 500 రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఏ. రాజ్యలక్ష్మి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. 2024 ఆగస్టు 4వ తేదీన ఉదయం 10 గంటల ప్రాంతంలో విధులు హాజరయ్యేందుకు ఆర్టీసీ బస్సు దిగి కాలినడకన రక్త మైసమ్మ దేవాలయం నుండి బయలుదేరింది. అక్కడే వేచి ఉన్న నానక్ రామ్ గూడ ప్రాంతానికి చెందిన టి. శ్రీరామ్ (28) మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశాడు. దాడి చేయడంతో కింద పడ్డ ఆమెపై నిందితుడు గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు గమనించి నిందితుని భారీ నుండి మహిళా కానిస్టేబుల్ ను కాపాడి నిందితుడిని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. 2024 జనవరి నెలలో సైతం నిందితుడు మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. డబ్బులు అడగగా లేవని మందలించడంతో కక్ష పెంచుకొని నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో న్యాయమూర్తి నిందితునికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించారు.

Next Story