హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

by Taduka Kalyani |

హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
X

దిశ, తూప్రాన్: హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. యాట శ్రీధర్, తుపాకుల శోభ కుటుంబాల మధ్య ఆటోకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చేగుంట మండలం అనంతసాగర్ సమీపంలో యాట శ్రీధర్ వాహనం ఢీకొని మృతి చెందాడు. అయితే శ్రీధర్ మరణానికి రాణబోయిన యాదగిరే కారణమని అనుమానించిన మృతుడి బంధువులు ప్రతీకారానికి దిగారు. ఈ క్రమంలో రాణబోయిన యాదగిరిని తూప్రాన్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి హత్య చేసిన అనంతరం, మృతదేహాన్ని కొప్పులపల్లి డ్యామ్‌లో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా యాట కిషన్, దిద్దికాడి లింగం, యాట లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల ముగ్గురిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ వెంకటరాజా గౌడ్, ఎస్‌ఐ గంగరాజు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story