సీఎం విజయ్‌, త్రిషపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు నమోదు

by Ajay Maddhiboyina |

సీఎం విజయ్‌, హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనితా రాధా రాధాకృష్ణన్ పై కేసు నమోదైంది. తమిళనాడులో జరిగిన ఓ బహిరంగ సభలో విజయ్, త్రిషలపై అనితా రాధా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

సీఎం విజయ్‌, త్రిషపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం విజయ్‌, హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనితా రాధా రాధాకృష్ణన్ పై కేసు నమోదైంది. తమిళనాడులో జరిగిన ఓ బహిరంగ సభలో విజయ్, త్రిషలపై అనితా రాధా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం విజ‌య్, త్రిష‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు నోరు తెరిచి మాట్లాడ‌రా? ఆయ‌న‌ను చూస్తే ఇక్క‌డ ఇరుక్కుపోయిన‌ట్టు కనిపిస్తారు. ఇంట్లో ఓ హీరోయిన్ తో ఎంత సంతోషంగా ఉండేవాడిని.. ఇప్పుడు ఇక్క‌డ చిక్కుకుపోయాను.. అన్న‌ట్టుగా ఆయ‌న ఉన్నారు.

అంటూ అనితా రాధాకృష్ణ‌న్ ఎద్దేవా చేశారు. మ‌రోవైపు విజ‌య్ లుక్స్ పై సైతం ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. హీరో రూపాన్ని ఎగ‌తాళి చేస్తూ ఆయ‌న సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి రావ‌డంపై కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వివాదాస్ప‌దంగా మార‌డంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర‌వాత విజ‌య్ త్రిష‌పై కామెంట్స్ ఇది తొలిసారి కాదు. గ‌తంలో ప‌లువురు డీఎంకే నేత‌లు ఇలానే కామెంట్స్ చేశారు. ఇటీవ‌లే ఉద‌య‌నిధి స్టాలిన్ సైతం త్రిష‌ను రాజ‌కీయాల్లోకి లాగుతూ విజ‌య్ పై సెటైర్లు వేశారు.

Next Story