- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ ఇంటికి వస్తే ఎన్ని కేసులు ఉన్నాయని అడిగా: నారా లోకేష్
మంత్రి నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఇదివరకు తనపై చాలా కేసులు ఉన్నాయని అనుకునేవాడినని, 23 కేసులు ఉన్నాయని చెప్పారు. తరవాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ సందర్భంగా నీపై ఏం కేసులు ఉన్నాయ్.. నాపై 96 కేసులు ఉన్నాయని చెప్పారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఇదివరకు తనపై చాలా కేసులు ఉన్నాయని అనుకునేవాడినని, 23 కేసులు ఉన్నాయని చెప్పారు. తరవాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ సందర్భంగా నీపై ఏం కేసులు ఉన్నాయ్.. నాపై 96 కేసులు ఉన్నాయని చెప్పారన్నారు. అప్పుడు 96 కేసులు అంటే చాలా ఎక్కువ అనుకున్నానని తెలిపారు. ఓరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ నివాసానికి భోజనానికి వస్తే నవ్వుతూ మీపై ఎన్ని కేసులు ఉన్నాయని అడిగినట్టు చెప్పారు. దానికి ఆయన "ఆ ఏం పెద్ద లేదు అబ్బా 107 కేసులు నావి" అన్నారని తెలిపారు.
అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారని, ఎంత పోరాడి ఉంటారని లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని జూలై 10 నుండి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సార్ ప్రక్రియ జరుగుతుండటంతో నేతలు ఇబ్బందిపడవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాయకులు, కార్యకర్తల సూచనలమేరకే ఈ మార్పులు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనది అని కాబట్టి నాయకులు అలసత్వం ప్రదర్శించకూడదని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని చెప్పారు.






