- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరామర్శకు వెళ్తూ మృత్యుఒడిలోకి..
అనారోగ్యంతో ఉన్న అత్తగారిని పరామర్శించేందుకు స్వగ్రామానికి బయలుదేరిన ఓ సిమెంట్ పరిశ్రమ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, మఠంపల్లి: అనారోగ్యంతో ఉన్న అత్తగారిని పరామర్శించేందుకు స్వగ్రామానికి బయలుదేరిన ఓ సిమెంట్ పరిశ్రమ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటి శ్రీనివాస్ (39) మఠంపల్లిలోని సాగర్ సిమెంట్ పరిశ్రమలో గత 13 సంవత్సరాలుగా ట్రాకింగ్ విభాగంలో లోడింగ్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. తన అత్తగారి ఆరోగ్యం విషమంగా ఉందన్న సమాచారం అందడంతో విధులను ముందుగానే ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో సుల్తాన్‌పూర్ గ్రామ సమీపానికి చేరుకోగానే ఆకస్మికంగా రోడ్డుపైకి వచ్చిన గేదెను అతను ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు శ్రీనివాస్ వాహనం నుంచి ఎగిరిపడి రోడ్డు పక్కన ఉన్న రాళ్ల మధ్య పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య సుకన్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.






