సంబంధం లేని మూడు దేశాల్లో ఒకేసారి భూకంపం.. శాస్త్రవేత్తల సంచలన సిద్ధాంతం!

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-25 10:30:00  IST  )

వెనిజులా/కాంబోడియా, జపాన్, కశ్మీర్ మూడు వేర్వేరు ప్రాంతాలు అంటే ఒకే టెక్టోనిక్ ప్లేట్ లేని దేశాలు. అయినా ఒకేసారి ఈ మూడు ప్రాంతాల్లో ఎందుకు భూకంపం వచ్చింది.

సంబంధం లేని మూడు దేశాల్లో ఒకేసారి భూకంపం.. శాస్త్రవేత్తల సంచలన సిద్ధాంతం!
X

దిశ, వెబ్‌డెస్క్: వెనిజులా/కాంబోడియా, జపాన్, కశ్మీర్ మూడు వేర్వేరు ప్రాంతాలు అంటే ఒకే టెక్టోనిక్ ప్లేట్ లేని దేశాలు. అయినా ఒకేసారి ఈ మూడు ప్రాంతాల్లో ఎందుకు భూకంపం వచ్చింది. భూకంపాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.. కానీ, ఒకేసారి వేర్వేరు టెక్టానిక్ ప్లేట్లలో భూకంపాలు రావడం చాలా అరుదు. అలాంటిదే ఈ రోజు (25.06.2026)న చోటుచేసుకున్నది. ఇలాంటి భూకంపాలకు.. భూభ్రమణ వేగంలో మార్పులే కారణమని 2017లో కొలరాడో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రోజర్ బిల్హామ్ (Roger Bilham), మోంటానా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెబెక్కా బెండిక్ (Rebecca Bendick) అనే ఇద్దరు జియోఫిజిసిస్టులు థియరీ విడుదల చేశారు.

భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. చంద్రుడి గురుత్వాకర్షణ (Tidal friction), భూమి లోపలి ద్రవాల (Liquid outer core) కదలికల వల్ల భూభ్రమణ వేగంలో మిల్లీసెకన్ల (Milliseconds) మార్పులు వస్తుంటాయి. దీనినే 'లెంత్ ఆఫ్ డే' వేరియేషన్స్ అంటారు. దీనిని అటామిక్ గడియారాల ద్వారా అత్యంత కచ్చితంగా కొలుస్తారు. భూమి ఒకే ఘన పదార్థం కాదు. మధ్యలో ఉన్న కోర్ (Core), దాని పైన ఉన్న మ్యాంటిల్ (Mantle), పై పొర అయిన లిథోస్ఫియర్ (Crust/Tectonic plates) వేర్వేరు వేగాలతో తిరుగుతుంటాయి. భూభ్రమణం నెమ్మదించినప్పుడు, అత్యంత బరువైన లోపలి పొరల (Mantle) వేగానికి, పై పొరల వేగానికి మధ్య సమన్వయం దెబ్బతిని ఘర్షణ పెరుగుతుంది. భూమి తిరిగే వేగం నెమ్మదించినప్పుడు, దాని ఆకృతిలో సూక్ష్మమైన మార్పు వస్తుంది (భూమధ్యరేఖ వద్ద కాస్త కుంచించుకుపోతుంది). దీనివల్ల భూమి పైపొర అయిన టెక్టోనిక్ ప్లేట్ల నెట్‌వర్క్ అంతటిపై ఒకేసారి అపారమైన గ్లోబల్ ఒత్తిడి పడుతుంది.

జపాన్, కొలంబియా/వెనెజులా, లేదా కాశ్మీర్ లాంటి యాక్టివ్ ఫాల్ట్ లైన్లలో అప్పటికే దశాబ్దాలుగా తీవ్రమైన టెక్టోనిక్ ఒత్తిడి కూరుకుపోయి ఉండి, అవి 'బ్రేకింగ్ పాయింట్' వద్ద ఉంటే... ఈ భూభ్రమణ నెమ్మదింపు వల్ల ఏర్పడే గ్లోబల్ ప్రెషర్ వాటికి 'ఫైనల్ పుష్ (Nudge)' ఇస్తుంది. ఈ చిన్న ట్రిగ్గర్ చాలు, సంబంధం లేని వేర్వేరు ఖండాల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే ఒకేసారి భారీ భూకంపాలు సంభవించడానికి. 1900వ సంవత్సరం నుండి సంభవించిన 7.0 మరియు అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాల డేటాను వీరు విశ్లేషించారు. భూభ్రమణం గరిష్ట స్థాయికి చేరుకుని నెమ్మదించడం ప్రారంభించిన సరిగ్గా 5 ఏళ్ల తర్వాత... ప్రపంచవ్యాప్తంగా భారీ భూకంపాలు ఒక గుంపుగా (Clusters) వస్తున్నాయని వీరు ఆధారాలతో సహా నిరూపించారు. ఇప్పటివరకు భూకంపాలను ఎప్పుడు వస్తాయో ముందుగా ఊహించడం దాదాపు అసాధ్యం. కానీ ఈ సిద్ధాంతం కచ్చితమైనదని తేలితే, 'అటామిక్ క్లాక్' డేటాను ఆధారంగా చేసుకుని భూమిపై భారీ భూకంపాల ముప్పును కనీసం 5 ఏళ్ల ముందే అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చు. భవిష్యత్తులో కేవలం స్థానిక ఫాల్ట్ లైన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, భూభ్రమణ డేటాకి (LOD), గ్లోబల్ టెక్టోనిక్ ఒత్తిడికి మధ్య ఉన్న కనెక్షన్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఎన్ని దేశాలు రిస్క్ జోన్‌లో ఉన్నాయో కచ్చితమైన 'మ్యాపింగ్' చేయవచ్చు.

చారిత్రక ఉదాహరణలు

1970ల ప్రారంభ దశ: 1960ల చివరలో భూభ్రమణ వేగం నెమ్మదించింది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత, 1970ల ప్రారంభంలో (ముఖ్యంగా 1971 - 1976 మధ్య) భూకంపాల క్లస్టర్ ఏర్పడింది. చైనాలో వచ్చిన ట్యాంగ్‌షాన్ (Tangshan - 1976) భూకంపం (తీవ్రత 7.6, సుమారు 2.4 లక్షల మంది మృతి) ఈ క్లస్టర్ సమయంలో వచ్చిందే.

2010ల మెగా-క్వేక్ క్లస్టర్: 2000వ దశకం మధ్యలో భూమి రొటేషన్ మళ్లీ ఒక దశ నెమ్మదింపుకు గురైంది. దానికి ప్రతిస్పందనగా ఐదేళ్ల తర్వాత వరుసగా అత్యంత భారీ భూకంపాలు

(Mega-quakes) ప్రపంచాన్ని కుదిపేశాయి:

2010: హైతీ భూకంపం (తీవ్రత 7.0 - భారీ ప్రాణనష్టం)

2010: చిలీ భూకంపం (తీవ్రత 8. 8 )

2011: జపాన్ (తోహోకు) భూకంపం & సునామీ (తీవ్రత 9.0 - చరిత్రలో అత్యంత వినాశకరమైనది)

2012: సుమత్రా (ఇండోనేషియా) ఆఫ్-షోర్ భూకంపం (తీవ్రత 8.6)

Next Story