- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. నా లైఫ్‌లో కాస్ట్‌లీ ఫ్రేమ్ అంటూ పోస్ట్
డిఫరెంట్ కంటెంట్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా తన తదుపరి ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చాడు.

దిశ, సినిమా: డిఫరెంట్ కంటెంట్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా తన తదుపరి ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ దర్శకులు, నిర్మాతలు, నటులు అయినా సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, కన్నడ నటుడు దర్శకుడు రిషభ్ శెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యేర్నేని, రవిశంకర్, దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి నవీన్ పొలిశెట్టి ఓ వీడియోను పంచుకున్నారు. అంతే కాకుండా.. ఈ భారీ కలయికకు సంబంధించి ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘నా లైఫ్‌లో కాస్ట్‌లీ ఫ్రేమ్.. లోకేష్ కనగరాజ్ రూ.500 కోట్లు, రిషభ్ శెట్టి రూ.800 కోట్లు, మైత్రీ నిర్మాతలు, సుకుమార్ కలిపి రూ.2000 కోట్లు, ప్రశాంత్ నీల్ రూ.2000 కోట్లు, చివరగా నావీ (నవీన్ పొలిశెట్టి వాటా) రూ.100 కోట్లు.. మొత్తం కలిపి ఇది రూ.5500 కోట్ల ఫ్రేమ్’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అంతే భారీ ప్రేమ్‌లో సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు రావాల్సిందే అంటూ నవీన్ షేర్ చేసిన ఈ వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుండగా. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ.. ‘మైత్రీ కుటుంబంలోకి మీకు స్వాగతం నవీన్ పొలిశెట్టి. 'స్టార్ ఎంటర్‌టైనర్'తో కూడిన పూర్తి స్థాయి వినోదభరితమైన చిత్రం రాబోతోంది.. ఆ సందడికి సిద్ధంగా ఉండండి.. అప్డేట్స్ కోసం వేచి చూడండి’ అంటూ తెలిపారు.






