- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతకు వరంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్
రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో గురువారం రూ.42 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

దిశ, రాజాపూర్ : రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో గురువారం రూ.42 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచే దిశగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
గ్రామీణ ప్రాంత యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. రంగారెడ్డిగూడెంలో ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కావడం నియోజకవర్గానికి గర్వకారణమని, యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యువత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






