ఎస్ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణకు టీపీసీసీ కంట్రోల్ రూమ్

by Ajay Maddhiboyina |

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు టీపీసీసీ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణకు టీపీసీసీ కంట్రోల్ రూమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు టీపీసీసీ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ ప్రధాన కోఆర్డినేటర్లుగా ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, ఎస్.ఐ.ఆర్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్‌లను నియమించారు. అలాగే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను నియమించారు.

పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు..

ఆదిలాబాద్- కొల్కొండ సంతోష్

పెద్దపల్లి- శశిభూషణ్ కాచే

కరీంనగర్- డాక్టర్ మద్దెల సంతోష్ ముదిరాజ్

నిజామాబాద్- బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

జహీరాబాద్- డాక్టర్ జులూరు ధనలక్ష్మి

మెదక్- జి.వి. వెన్నెల

మల్కాజ్‌గిరి- సుబ్రహ్మణ్యం పొన్నాడ

సికింద్రాబాద్- ఎం.రాఘవేంద్ర రెడ్డి

హైదరాబాద్- అచ్యుత యాదవ్

చేవెళ్ల- ఎస్.జగదీశ్వర్ రావు

మహబూబ్‌నగర్- టి.రేవతి గౌడ్

నాగర్‌కర్నూల్- ఒబెదుల్లా కొత్వాల్

నల్గొండ- కస్బా శ్రీనివాసరావు

భువనగిరి- డాక్టర్ బైకిని లింగం యాదవ్

వరంగల్- పీర్ ఇర్షాద్ అహ్మద్ నాసిర్

మహబూబాబాద్- నూతి శ్రీకాంత్ గౌడ్

ఖమ్మం- జి.రాఘవేందర్

Next Story