- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
by Gantepaka Srikanth |
తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు (డైరెక్టర్) నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారి కోసం, మార్కులు పెంచుకోవాలనుకున్న వారి కోసం నిర్వహించిన ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ రికార్డు సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం తదుపరి ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. ఫలితాల కోసం https://bse.telangana.gov.in/ ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






