- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోను ఢీకొన్న కంటైనర్
by Ratna Kumari |
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ ఆటోను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి భిక్కనూరు వైపు వస్తున్న ప్యాసింజర్ ఆటోను అదే దారిలో వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ అక్కడికక్కడే మృతిచెందారు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Next Story






