నేను ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్న.. నెక్ట్స్ సినిమా అప్డేట్ ఇచ్చిన యంగ్ హీరోయిన్

by Chukka Sudharani |

ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గట్ట కుస్తీ-2’.

నేను ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్న.. నెక్ట్స్ సినిమా అప్డేట్ ఇచ్చిన యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా: ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గట్ట కుస్తీ-2’. 2022లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. చెల్లా అయ్యావు తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా జులై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇందులో భాగంగానే తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి తన తదుపరి ప్రాజెక్టులపై అప్డేట్ ఇచ్చింది. ‘ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవచ్చో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఇది నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన వాటికి భిన్నంగా, వేరొక భాషలో రూపొందుతున్న చిత్రం. ఇదొక సోషియోలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందబోతుండగా.. దీనికి ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే.. దీని ప్రధాన బృందం అంతా మహిళలతోనే ఉంటుంది. మేము ఈ సినిమా ద్వారా 1996 నాటి నేపథ్యంతో కూడిన ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎక్కువ వివరాలు వెల్లడించలేను కానీ, ఇది ఒక సోషియోలాజికల్ థ్రిల్లర్ అని, దీని పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని మాత్రం చెప్పగలను’ అని తెలిపింది.

Next Story