- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయిలో మెరిసిన ఓద్యారం బడి
గంగాధర మండలానికి చెందిన ఓద్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

దిశ, గంగాధర : గంగాధర మండలానికి చెందిన ఓద్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. SHVR–2025–26 జాతీయ స్థాయి రేటింగ్‌లో ఈ ప్రభుత్వ పాఠశాల దేశవ్యాప్తంగా 23వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించింది. ఈ విశిష్ట విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం గురువారం తన నివాస క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికే గర్వకారణమని కొనియాడారు.
ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్తుకు నిజమైన పట్టుకొమ్మలు. ఇక్కడ చదివే విద్యార్థులే రేపటి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు, అని ఆయన పేర్కొన్నారు. గతంలో 2017–18 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న సందర్భంలో కూడా తాను ఎంతో సంతోషించానని, ఇప్పుడు అదే పాఠశాల జాతీయ స్థాయిలో విజయపతాకాన్ని ఎగురవేయడం మరింత ఆనందాన్ని, గర్వాన్ని కలిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఓద్యారం జడ్‌పీహెచ్‌ఎస్ ఈ ఘనత సాధించడం వెనుక ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సమిష్టి కృషి ఉందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయ బృందం చూపుతున్న అంకితభావం ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో ఈ పాఠశాల మరిన్ని జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






