- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కలిసి పని చేయడం గొప్ప విషయం: కర్ణాటక సీఎం డీకే శివకుమార్
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నాయకత్వంలో ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, తాను చరిత్ర సృష్టించామన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నాయకత్వంలో ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, తాను చరిత్ర సృష్టించామన్నారు. తాము చరిత్ర చదవమని, చరిత్ర లిఖించము అని కానీ చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జత కూడటం ఆరంభం అని, కలిసి నిర్ణయం తీసుకోవడం ప్రగతి అని, కలిసి పనిచేస్తే విజయం సాధిస్తామని అన్నారు. ఇప్పుడు మూడు రాష్ట్రాల రైతుల కోసం కలిసి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మా నీళ్లు.. మా హక్కు అనే నినాదాన్ని నిజం చేశామని చెప్పారు. 1860లో తుంగభద్ర నదిపై ప్రాజెక్టును కట్టారని అన్నారు. ఆ రోజు ప్రాజెక్టును కడితే ఈరోజు రక్షించామని అన్నారు. కృష్ణా, కావేరి, గోదావరి విషయంలోనూ మనందరం ఏకం కావాలని రైతులను బతికించాలమని చెప్పారు.






