- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం
by Ratna Kumari |
బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, తన ఓటరు వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.

X
దిశ, బాన్సువాడ: బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, తన ఓటరు వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఆర్‌డీఓ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అర్హులైన వారందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story






