- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో తీవ్ర కలకలం.. శ్మశాన వాటికలో వ్యక్తి ఆత్మహత్య
హుజూరాబాద్ పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం లేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం లేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన పంజాల బిక్షపతి గౌడ్(48) గత కొద్దిరోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటానని తరచూ కుటుంబ సభ్యులతో అనేవాడు. కాగా, బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన బిక్షపతి గౌడ్.. పట్టణంలోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కలచివేసిన ఘటన..
సాధారణంగా మృతి చెందిన తర్వాత ఎవరినైనా స్మశాన వాటికకు తీసుకెళ్తారు. కానీ, బతికుండగానే బిక్షపతి గౌడ్ స్మశాన వాటికకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం పలువురిని తీవ్రంగా కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య పంజాల శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ టౌన్ సీఐ టి.కరుణాకర్ తెలిపారు.






