- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 4వ మెగా సర్జికల్ క్యాంప్ ప్రారంభం
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన వైద్య వృత్తిని ప్రజాసేవతో మేళవిస్తున్నారు.

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన వైద్య వృత్తిని ప్రజాసేవతో మేళవిస్తున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తూనే పేద రోగులకు స్వయంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అచ్చంపేట పట్టణంలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంపును ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ క్యాంపులో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల శస్త్రచికిత్సల కోసం 800 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి రోజు దాదాపు 80 శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేర్లు నమోదు చేసుకున్న రోగులకు దశలవారీగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మెగా సర్జికల్ క్యాంపును ప్రారంభించి నిరంతరంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత మూడు విడతల సర్జికల్ క్యాంపుల్లో మొత్తం 1,472 మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దీంతో పేద రోగులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు మెరుగైన ఆరోగ్యం కల్పించగలిగామని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో స్థానిక వైద్య సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం నిర్వహిస్తున్న నాలుగో విడత సర్జికల్ క్యాంప్‌కు అచ్చంపేట పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలతో పాటు గాలి పంకాలు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లు తదితర సామగ్రిని అందించి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తారాసింగ్, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రతాప్‌రాజ్, ఇతర వైద్యులు, అలాగే కల్వకుర్తి, వనపర్తి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 60 మంది వైద్య, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.






