- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: కలెక్టర్
by Taduka Kalyani |
జిల్లాలో అర్హుడైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య లక్ష్యమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు

X
దిశ, కొండపాక: జిల్లాలో అర్హుడైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య లక్ష్యమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ఇంటింటి సర్వే సర్ ను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 30 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని, ఓటర్లు తమ పూర్తి వివరాలతో వాటిని సమర్పించాలని కోరారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మరణించిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మల్లికార్జున్, బీఎల్ఓలు పాల్గొన్నారు.
Next Story






