సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వండి.. సాయికృష్ణ కేసుపై కోర్టు కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

జ్యూడిషియ‌ల్ విచార‌ణ కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి విజ‌య‌ల‌క్ష్మి వేసిన‌ పిటిష‌న్ పై నేడు జిల్లా కోర్టు విచార‌ణ జ‌రిపింది. కోర్టులో విజ‌య‌ల‌క్ష్మి త‌రుపున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపించారు. కృష్ణలంక స్టేషన్, స్వర్గపురి లో సిసి ఫుటేజ్ మాయంపై వారు అభ్యంతరం వ్య‌క్తం చేశారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వండి.. సాయికృష్ణ కేసుపై కోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: జ్యూడిషియ‌ల్ విచార‌ణ కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి విజ‌య‌ల‌క్ష్మి వేసిన‌ పిటిష‌న్ పై నేడు జిల్లా కోర్టు విచార‌ణ జ‌రిపింది. కోర్టులో విజ‌య‌ల‌క్ష్మి త‌రుపున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపించారు. కృష్ణలంక స్టేషన్, స్వర్గపురి లో సిసి ఫుటేజ్ మాయంపై వారు అభ్యంతరం వ్య‌క్తం చేశారు. సీఐ నాగరాజుపై పటమట సీఐ విచారణ చేయటంపై సైతం అభ్యంతరం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా సాయికృష్ణ మృతదేహం ఏమైందో ఇప్పటికీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనలేదని అన్నారు. రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పలు అంశాలు పేర్కొనలేదని న్యాయ‌వాదులు వాదించారు. దీంతో కృష్ణలంక స్టేషన్, స్వర్గపురిలో సీసీ కెమెరా ఫుటేజ్ కోసం డిస్టిక్ లెవెల్ కమిటీకి కోర్టు నోటీసులు జారీచేసింది.

విజయవాడ పోలీస్ కమిషనర్, వీఎంసి కమిషనర్, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. సాయికృష్ణ‌ను సీఐ నాగ‌రాజు చంపి ఆధారాలు మాయం చేశాడ‌ని అత‌డి త‌ల్లి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో నాగ‌రాజును అరెస్ట్ చేశారు. నాగ‌రాజు సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేసి ఆధారాలు మాయం చేశాడ‌ని ఇప్ప‌టికే సిట్ కోర్టుకు తెలిపింది. ఈకేసులో నాగరాజుకు అత‌డికి స‌హ‌క‌రించిన పోలీసుల‌కు ఎలాంటి శిక్ష‌లు ప‌డ‌తాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story