ట్రాలీ ఆటో ఢీ.. యువకుడి దుర్మరణం

by Batti.Sumithra |

ట్రాలీ ఆటో ఢీ కొట్టిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది.

ట్రాలీ ఆటో ఢీ.. యువకుడి దుర్మరణం
X

దిశ, చొప్పదండి : ట్రాలీ ఆటో ఢీ కొట్టిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్నకొండ గ్రామానికి చెందిన గుంట మహేష్ (25), డిగ్రీ పూర్తి చేసి హమాలీగా పని చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి గం 11.30 లకు చొప్పదండిలో ఓ వివాహ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి నడుచుకుంటూ వచ్చేక్రమంలో మర్లవాడ వద్ద చొప్పదండి నుంచి ధర్మారం వైపు వెళ్తున్నటువంటి ట్రాలీ ఆటో మహేష్ ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించి, తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి భీరయ్య ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుమ్మడి తిరుపతి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.

Next Story