- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
44వ జాతీయ రహదారిపై రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన ఘటనలు గురువారం భిక్కనూరు మండల కేంద్రం, బస్వాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్నాయి.

దిశ, భిక్కనూరు : 44వ జాతీయ రహదారిపై రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన ఘటనలు గురువారం భిక్కనూరు మండల కేంద్రం, బస్వాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్‌పై ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఇద్దరు యువకులను భిక్కనూరు మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలోని వంతెన వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.వారిని వెంటనే జీఎంఆర్ అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, నల్గొండ జిల్లాకు చెందిన అఖిల్ (20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో యువకుడు, ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా రామాయంపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీ హైవేపై అతివేగంగా వెళ్తూ అకస్మాత్తుగా ఎడమవైపుకు మళ్లడంతో అదే దారిలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల రమేష్ గౌడ్ (50) ఆటోలో నుంచి కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుర్మిండ్ల శ్రీనివాస్ గౌడ్, ప్రయాణికులు లక్ష్మీ, శ్వేత గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతుడి భార్య కాసాల స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. ఒకే రోజు రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడం, మరో నలుగురు గాయపడడం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.






