తుపాకీ చూపించి దోపిడీకి స్కెచ్..

by Taduka Kalyani |

హైదరాబాద్ లో తుపాకీ చూపించి దోపిడీలు చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు క్రిమినల్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

తుపాకీ చూపించి దోపిడీకి స్కెచ్..
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో తుపాకీ చూపించి దోపిడీలు చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు క్రిమినల్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ కు చెందిన ముద్దసిర్ హుస్సేన్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. 2022లో ముంబయికి వెళ్ళి అక్కడ ఏబిల్ బాడీడ్ సీమెన్ కోర్సు చేశాడు. ఆ తర్వాత రెండు నెలల పాటు ఎల్ అండ్ టీ సంస్ధలో పని చేశాడు. అనంతరం కమీషన్ ల మీద కారులను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేశాడు. అదే విధంగా ముంబయి నుంచి కారులను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ తో పాటు ఓఎల్ఎక్స్ ద్వారా అమ్మకాలు చేశాడు. ఈ సందర్భంలో ముద్దసిర్ హూస్సేన్ కు ముంబయి లో షోయబ్ ద్వారా సూరజ్ సింగ్ ను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత సూరజ్ సింగ్ అతని అనుచరులతో కలిసి మహారాష్ట్రలో ఒక వ్యాపారీని కిడ్నాప్ చేశాడు, కర్ణాటకలో ఓ దోపిడీ కేసులో కూడా పాల్గొన్నాడు. ఈ రెండు కేసులలో సూరజ్ సింగ్ గ్యాంగ్ తో కలిసి జైలు కు వెళ్ళాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత సూరజ్ సింగ్ గ్యాంగ్ లోని సభ్యుడు ముద్దసిర్ హూస్సేన్ కు పిస్టల్ తో పాటు బుల్లెట్ లను ఇచ్చాడు. ఇటీవల హూస్సేన్ కు ఆర్ధిక కష్టాలు రావడంతో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేసేందుకు స్కెచ్ వేశాడు. ఈ దోపిడీల కోసం మహారాష్ట్రకు చెందిన అమీర్ ఖాన్ ను తనతో కలుపుకున్నాడు. ఈ దోపిడీలను చేసేందుకు కారులో అనుమానాస్పదంగా మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో సంచరిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వీరి దగ్గర రెండు తొపాకులు, 7 బుల్లెట్ లు దొరికాయి. విచారణలో ఈ ఇద్దరు దోపిడీలకు ప్లాన్ చేశారని ప్రాథమిక ఆధారాలు లభించడంతో పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రయత్నించినా సహించేది లేదని డీసీపీ హెచ్చరించారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణలో వీరి పాత కేసులతో పాటు మొయినాబాద్ లో నమోదైన ఓ కేసులో కూడా వీరిద్దరు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలో ఓ రాజకీయ ప్రముఖుడి సమీప బంధువును కిడ్నాప్ చేసిన కేసులో ముద్దసిర్ ఉన్నట్లు తేలింది.

Next Story