- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ షాక్ తగిలి రైతు మృతి..!
పంట చేనును అడవి జంతువుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసుకున్న సోలార్ ఫెన్సింగ్ ఓ రైతు ప్రాణాలను బలిగొంది.

దిశ, కుబీర్: పంట చేనును అడవి జంతువుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసుకున్న సోలార్ ఫెన్సింగ్ ఓ రైతు ప్రాణాలను బలిగొంది. సోలార్ ఫెన్సింగ్‌పై తెగిపడిన విద్యుత్ తీగలను గమనించకపోవడంతో కరెంట్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సిరిపెల్లి (హెచ్) గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పబ్బు రాజన్న (60) తన వ్యవసాయ భూమికి అడవి జంతువుల బెడద నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఫెన్సింగ్‌పై నుంచి వెళ్లే విద్యుత్ తీగలు ఇటీవల తెగిపడి ఫెన్సింగ్‌పై పడ్డాయి. ఈ విషయాన్ని రాజన్న గమనించలేదు. గురువారం ఉదయం ఎప్పటిలాగే వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటి నుంచి చేనుకు వెళ్లాడు. సాగు కోసం భూమిని సిద్ధం చేసుకున్న రాజన్న, ఫెన్సింగ్ దాటే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో మాట్లాడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిన రాజన్న తిరిగి శవంగా మారడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమారుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, సిరిపెల్లి గ్రామానికి సమీపంలోని పల్సి గ్రామంలో కూడా బుధవారం కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి.






