- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసారి డబుల్ యాక్షన్‌తో ‘మిర్జాపూర్’.. అఫీషియల్ టీజర్ వైరల్
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్‌లో ‘మిర్జాపూర్’ ఒకటి.

దిశ, సినిమా: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్‌లో ‘మిర్జాపూర్’ ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూడు సీజన్ల పాటు ఓటీటీ ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపై రచ్చ చేయడానికి సిద్ధమైంది. భారీ ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ అఫీషియల్ టీజర్‌ను విడుదల చేశారు. ఇక టీజర్ గమనించినట్లు అయితే.. పంకజ్ త్రిపాఠి కాలీన్ భయ్యాగా, అలీ ఫజల్ గుడ్డూ భయ్యాగా, దివ్యేందు మున్నా భయ్యాగా తమ ఐకానిక్ పాత్రల్లో మళ్లీ కనిపించి అభిమానులను అలరించగా.. రవి కిషన్, పంచాయత్ ఫేమ్ జితేంద్ర కుమార్ కీలక పాత్రల్లో ఎంట్రీ ఇస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచారు. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ టీజర్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మరింత భారీ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సాగుతూ.. సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా.. ఈ సారి కేవలం మిర్జాపూర్ గద్దె కోసమే కాకుండా అధికారం కోసం కూడా యుద్ధం జరగబోతోందని హింట్ ఇస్తూ టీజర్ కట్ చెయ్యగా.. భారీ హైప్ నెలకొంది. కాగా.. ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.






